Tuesday, February 24, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మంత్రి శీధర్ బాబు

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మంత్రి శీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, మంథని నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతిని ఆయన తెలిపారు.

కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు. పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ  గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు. పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని  సూచించారు. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -