Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజు కోసం క్షత్రియ కళశాల యాజమాన్యం వేధింపులు

ఫీజు కోసం క్షత్రియ కళశాల యాజమాన్యం వేధింపులు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ఫీజు అధికంగా చెల్లించాలని ఆర్మూర్ కు చెందిన క్షత్రియ కళశాల యాజమాన్యం వేధిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ప్రజావాణిలో తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము కళాశాలలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందినప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.15,780 పోను, కళాశాల ఫీజు రూ. 880 చెల్లించామన్నారు. అయితే ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్, కళాశాల ఫీజు, బిల్డింగ్ డెవలప్ మెంట్ ఫీజు పేరుతో మొత్తం రూ.24 వేలు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి తెస్తుందన్నారు. పేద విద్యార్థులమైన తాము అంత ఫీజు చెల్లించలేమని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -