Friday, November 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభార్య బంధువుల వేధింపులు.. చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

భార్య బంధువుల వేధింపులు.. చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భార్య తరఫు బంధువుల వేధింపులకు కలత చెందడంతో.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావు­లూ­రి కామరాజు అలియాస్‌ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్‌ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.  ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్‌ (11),  గౌతమ్‌ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసు­కుని బలవన్మరణానికి పాల్ప­డ్డాడు. స్థాని­కుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు న­మోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావు­లూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొ­న్నాడు.  ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -