Tuesday, May 20, 2025
Homeతాజా వార్తలురాజ్‌భవన్‌లో చోరీ..

రాజ్‌భవన్‌లో చోరీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్‌లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్‌భవన్‌ అధికారులు గుర్తించారు. ఈ నెల 13న చోరీ ఘటన చోటుచేసుకోగా.. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -