- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు అల్లాడుతున్నారు. మండలంలోని తాడిచెర్ల, కొయ్యుర్, ఎడ్లపల్లి, రుద్రారం, కొండంపేట, మల్లారం,పెద్దతూండ్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు తడిసి ముద్దాయై, మొలకలు వచ్చాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. టార్పాలిన్లు వేసి పంటను కాపాడుకుంటున్నారు. కొనుగోళ్లు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
- Advertisement -