రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధం
ముంబయి : ముంబయి ఇండియన్స్ కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య బరిలోకి దిగలేదు. హార్దిక్ పాండ్య లేని వేళ సూర్యకుమార్ యాదవ్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుతం కోలుకున్న పాండ్య.. ముంబయి ఇండియన్స్ తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ‘హార్దిక్ పాండ్య ఆరోగ్యంగా ఉన్నాడు. నెట్స్‌లో సాధన ప్రారంభించాడు. ప్రస్తుతం బాగున్నాడు. హార్దిక్ గాయం బారిన పడలేదు, అస్వస్థతకు లోనయ్యాడు. అందుకే గత మ్యాచ్‌కు అందుబాటులో లేడు’ అని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ పరాస్ తెలిపాడు. హార్దిక్ పాండ్య స్థానంలో దీపక్ చాహర్ తుది జట్టులో నిలిచాడు. ముంబయి ఇండియన్స్, రాజస్తాన్ రాయల్ మ్యాచ్ మంగళవారం జరుగనుంది. జట్టుతో పాటు గువహటికి చేరుకున్న హార్దిక్ పాండ్య.. రాయల్స్‌తో సమరానికి సై అనేందుకు సిద్ధంగా ఉన్నాడు.



