నవతెలంగాణ – రామారెడ్డి
ఎమ్మెల్యేలు కార్యకర్తలను గౌరవించడం లేదని, గుర్తించటం లేదని సోమవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుని ఎంపిక కోసం అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ అధ్యక్షతన, ఏఐసీసీ పరిశీలకులు రాజపాల్ కరోల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడిన వారిని లెక్కచేయకుండా, కొత్తగా వచ్చిన వారికే గుర్తింపు, పదవులు కేటాయిస్తున్నారని, దీనితో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతుందని, విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఒకరితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని గుర్తుంచుకోవాలని, దాని వెనుక కాంగ్రెస్ కార్యకర్తల, నాయకుల శ్రమ ఉందని గుర్తించాలని అన్నారు. నిజమైన కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీకి గుర్తింపు, మంచి రోజులు ఉంటాయని సూచించారు. విభజించి పాలించే నాయకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్ తో పాటు జిల్లాలోని నాయకులు పాల్గొన్నారు.
కష్టపడిన కార్యకర్తలను గుర్తించడం లేదు: నా రెడ్డి మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES