నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ సాహిత్య యవనికపై హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి, సాహిత్య సేవలు అభినందనీయమని ప్రముఖ కవి మంజీరా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిద్దంకి యాదగిరి అన్నారు. ఆయన నిజామాబాద్ వచ్చిన సందర్భంగా గురువారం సుభాష్ నగర్ లోని బాయిస్ కాన్వెంట్ లో జరిగిన కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం పక్షాన అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భాషలో తొలిసారిగా వచన కవితా రచన, కథారచన పోటీలు నిర్వహించడం హరిదా రచయితల సంఘానికే చెల్లిందని ఆయన అభినందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జన్మించిన హరిదా సంఘం ఆధ్వర్యంలో జిల్లా రచయితలు చేసిన పోరాటం ఆదర్శనీయమని, తెలంగాణ ఆవిర్భావమనంతరం తెలంగాణ సాహిత్య వికాసం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హరిత రచయితల సంఘం నదీ సంస్కృతికి తార్కాణంగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రజా చైతన్యమే పరమావధిగా రచయితలు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కోశాధికారి డాక్టర్ గంట్యాల ప్రసాద్, యు శ్రీనివాస్ గౌడ్, ఉమారాణి, సునంద, రమణి తదితరులు పాల్గొన్నారు.
హరిదా సాహిత్య సేవలు అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES