Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసాహిత్య రంగంలో హరిదా కృషి భేష్

సాహిత్య రంగంలో హరిదా కృషి భేష్

- Advertisement -

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అభినందన
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

జనవరి 1న రాత్రి హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని నిజామాబాద్ హరిదా  రచయితల సంఘం అధ్యక్షుడు  ఘనపురం దేవేందర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హరిదా రచయితల సంఘం నిర్వహించిన తెలంగాణ భాషలో కవితా రచనా కథా రచన పోటీల విజేతలకు  సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలను అందజేశారు. నిజామాబాద్ వేదికగా హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హరిదా ప్రతినిధులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, సతీశ్ కుమార్, డాక్టర్ మామిడి సాయినాథ్ అవార్డు గ్రహీతలు దుడ్డుంపూడి అనసూయ, మంజీత కుమార్, పువ్వాడ శారద, రాధా హిమబిందు, శ్రీ హర్ష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -