Wednesday, December 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేతగా హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేతగా హరీశ్‌రావు

- Advertisement -

సబితా ఇంద్రారెడ్డి, తలసాని కూడా…
మండలిలో ఉప నేతలుగా ఎల్‌ రమణ, పోచంపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాసన సభలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (బీఆర్‌ఎస్‌ఎల్పీ) ఉప నేతలు (డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు)గా మాజీమంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023, డిసెంబర్‌ ఏడో తేదీన అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేతలను నియమించారు. శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ శాసనమండలిపక్ష ఉప నేతలు (డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు)గా మాజీ మంత్రి ఎల్‌ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించామని తెలిపారు. మండలిలో బీఆర్‌ఎస్‌ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ ఉంటారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -