నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలో ముంపుకు గురైన పంటలను, కోతకు గురైన పోచారం ప్రాజెక్టును పరిశీలించడానికి ఎమ్మెల్యే హరీష్ రావు నాగిరెడ్డిపేట్ కు వస్తున్నట్లు బి ఆర్ఎస్ నాయకులు శనివారం తెలిపారు. శనివారం బిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంటలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఈ విషయంపై నాగిరెడ్డిపేట్ మండలాన్ని హరీష్ రావు సందర్శించనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, ఎంపిటిసిల పోరా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, హనుమంత్ రెడ్డి, వంశీ గౌడ్, మురళి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు నాగిరెడ్డిపేట్ కు హరీష్ రావు రాక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES