– ధరణి పేరుతో బీఆర్‌ఎస్ సర్కారు దగా
– రైతుల భూముల వివరాలను అమెరికా కంపెనీకి అప్పగించింది వారే
– సాదాబైనామాలను పరిష్కరించే పనిలో ప్రజా ప్రభుత్వం : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూ భారతిపై మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు నిరాధారమని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి కొట్టిపడేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధరణి పేరుతో దగా చేసింది బీఆర్‌ఎస్ సర్కారేనని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని తప్పిదాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై హరీశ్‌రావు రుద్దాలనుకో వడం దారుణమని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన భూ రికార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లను అమెరికా కంపెనీ టేరాసాకి అప్పగించిందని గుర్తుచేశారు. రైతులకు నష్టదాయకమని భావించే ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించి గాలికి వదిలేస్తే.. తమ ప్రజా ప్రభుత్వం భూ భారతిలో ఆ విషయాన్ని చేర్చడమే కాక హైకోర్టు స్టే ఎత్తివేసేలా కృషిచేసి క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఐసీకి భూభారతిని అప్పగించిందని చెప్పారు. భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పరిపాలన అధికారులను, మండలస్థాయిలో లైసెన్స్ సర్వేయర్లను నియమిం చిందని తెలిపారు. రైతు కమిషన్ కార్యాలయానికి ఇప్పటివరకు వచ్చిన మూడువేల మంది రైతులకు పరిష్కార మార్గాలు సూచించ డమే కాక స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిష్కరిచేందుకు కృషి చేశామని వివరించారు. లక్షల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం జరగాలంటే క్షేత్ర స్థాయి యంత్రాంగం పటిష్టంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసు కుంటున్న రైతులకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక ఎమ్మార్వో హత్యకు, ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వం కారణమైందని తెలిపారు.
హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



