Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయిన హరీశ్ రావు

ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయిన హరీశ్ రావు

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. హరీశ్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -