పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
పల్లెకెలె (శ్రీలంక) : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-2లో మంగళవారం పల్లెకెలెలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 165 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (100, 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), జోశ్ బట్లర్ (2) సహా జాకబ్ బెతెల్ (8), టామ్ బాంటన్ (2) నిరాశపరచగా.. 58/4తో ఇంగ్లాండ్ కష్టాల్లో కూరుకుంది. శామ్‌కరణ్ (16), విల్ జాక్స్ (28, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) జతగా కీలక భాగస్వామ్యాలు నిర్మించిన హ్యారీ బ్రూక్ 50 బంతుల్లోనే శతకం సాధించి ఇంగ్లాండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. వరుస వికెట్లతో ఆఖర్లో ఉత్కంఠ రేగినా.. జోఫ్రా ఆర్చర్ (6 నాటౌట్) సిక్సర్‌తో పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్ (63, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించగా, బాబర్ ఆజామ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) రాణించారు.
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్
- Advertisement -
- Advertisement -



