నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్థానిక తెలంగాణా హోటల్ వద్ద టోయట హర్ష కార్ ప్రవేట్ లిమిటెడ్ షోరూంను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో టోయట లాంటి పెద్ద పెద్ద షోరూంలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోయట కార్ ఉన్నా వారు ఎలాంటి సర్వీసింగ్ అయినా తరుచుగా హైదరాబాద్ వెళ్లే వారు ఇప్పుడు అలాంటి అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం షోరూం టీ కే ఎం ఎఫ్ ఆర్ అవతార్ సింగ్, సేల్స్ విపి ప్రశాంత్, . విజిఎం బాల కృష్ణ రెడ్డి, స్వామి, సర్వీస్ మేనేజర్ రాంబాబు, అడ్మిన్ సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. బాబు రావు. బిస్కోంట్ల సత్య నారాయణ, తాడూరి నర్సింహా. కృష్ణ యాదవ్. చిన్నం శ్రీను పాల్గోన్నారు.
హర్ష టొయోట కార్ షోరూం ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES