Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ర్టస్థాయి వ్యాసరచన పోటీలో హర్షితకు ప్రథమ బహుమతి

రాష్ర్టస్థాయి వ్యాసరచన పోటీలో హర్షితకు ప్రథమ బహుమతి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
అంకిత భవం పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చన్నది అక్షరాలా నిజం.. గ్రామస్థాయి నుండి మొదలుకొని మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సైతం తను ఏంటో తనలో దాగివున్న ఉత్తమ ఆట తీరును ప్రదర్శించి సత్తను నిరూపించుకుంది హర్షిత.. ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని టి.హర్షిత పదవ తరగతి రాష్ట్రస్థాయి టిసాట్, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం  జాయింట్ గా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో రాష్ట్ర ప్రథమ బహుమతి సాధించి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చేతుల మీదుగా బహుమతి స్వీకరించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన సందర్భంగా బుధవారం పిఆర్టీయు ఇందల్ వాయి మండల శాఖ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో అభినందన కార్యక్రమాన్ని అధ్యక్షులు కె.భార్గవ , ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

విద్యార్థిని హర్షిత కు శాలువాతో సన్మానించి తమవంతు ప్రోత్సాహకంగా హర్షిత కు రూ.500/- బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండలంలో ప్రతిభ బహుమతి గెలుపొందారని, మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందిందని, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయిలో జరిగిన పోటిలో మొదటి బహుమతి పొందడం జిల్లాకు, మండలానికి, గ్రామానికి గర్వ కారణమని, రాబోవు రోజుల్లో జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో ఎంపికై  ఉత్తమ ప్రతిభ కనబర్చుతు ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని వారు ఆకాంక్షించారు. హర్షిత కు  మెంటర్ గా వ్యవహరించిన గంగాధర్  కృషి ని కొనియాడుతూ ఆయనకు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాధురి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామల శ్రీ, ముబాసిర్, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు చెందిన  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -