Tuesday, March 31, 2026
E-PAPER
Homeసినిమా'హరుడు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘హరుడు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

వెంకట్‌ హీరోగా విఆర్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరుడు’. రాజ్‌ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు. సమ్మర్‌ స్పెషల్‌గా మే 8న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కానుంది. డి.లక్ష్మణ్‌రావు, ప్రవీణ్‌ రెడ్డి సహ నిర్మాతలు.
‘ఇది కంప్లీట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ.

హీరో వెంకట్‌కి ఈ సినిమా మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది’ అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. వెంకట్‌, శ్రీహరి, హెబ్బపటేల్‌, సలోని, నాటషా, అలీ, సుమన్‌, రవి వర్మ, సుభాశ్రీ, వేద్విక, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ, దిల్‌ రమేష్‌, దొరబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం: రాజ్‌ తాళ్లూరి, సంగీతం: మని జీన్న, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ :జీసీ క్రిష్‌, డిఓపి: ఆనంద్‌, ఎడిటర్‌: ఉప్పు మారుతీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఓంకార్‌ కడియం, యాక్షన్‌ కొరియోగ్రఫీ: శివ రాజ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -