Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హార్వెస్టర్లను ఆర్పీఎంలోనే ఉంచాలి..

హార్వెస్టర్లను ఆర్పీఎంలోనే ఉంచాలి..

- Advertisement -

– జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి

వరి కోతలు కోసే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకొని వరి కోతలకు తమ హార్వెస్టర్లను పంపాలని హార్వెస్టర్ల యజమానులకు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన హార్వెస్టర్ యజమానులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. జిల్లాలోని హార్వెస్టర్ యాజమానులు తమ హార్వెస్టర్లను నిర్దేశిత ఆర్పీఎం లో ఉంచి వరి కోతలు కోయాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లాలో ఈ సీజన్ వరి కోతలు ప్రారంభమవుతున్నందున హార్వెస్టర్ యాజమానులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు ప్రాధాన్యతా క్రమంలో వరి కోతలు చేపట్టాలని తెలిపారు. హార్వెస్టర్ ను నిర్దేశిత ఆర్పీఎం లో ఉంచి పొల్లు రాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు, హార్వెస్టర్ యాజమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -