Wednesday, February 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆయిల్‌ కొనుగోళ్లు భారత్‌ నిలిపివేసిందా?

ఆయిల్‌ కొనుగోళ్లు భారత్‌ నిలిపివేసిందా?

- Advertisement -

మాకు ఎలాంటి సమాచారం లేదు : క్రెమ్లిన్‌
మాస్కో :
ఆయిల్‌ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు రష్యాకు భారత్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ మంగళవారం తెలిపింది. క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, భారత్‌తో అన్ని సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని రష్యా భావిస్తోందని పెస్కోవ్‌ తెలిపారు. భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం రష్యా నుంచి చమరు కొనుగోళ్లు నిలిపివేయడానికి భారత్‌ అంగీకరించిం దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన ఒక రోజు తరువాత పెస్కోవ్‌ ఈ విషయాన్ని తెలిపారు. అయితే రష్యాకు ఎలాంటి సమాచారం లేకపోయినా, ఆ దేశం నుంచి భారత్‌ చేస్తున్న చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రియల్‌ టైమ్‌ అనలిటిక్స్‌ కంపెనీ కప్లెర్‌ సమాచారం ప్రకారం ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి భారత్‌ చేసిన ఆయిల్‌ కొనుగోళ్లు ఒక మిలియన్‌ బ్యారెళ్లకు పడిపోయాయి. అంతకు ముందు నెలలో ఇది రెండు మిలియన్‌ బ్యారెళ్లుకు పైగా ఉండేది. మరోవైపు కప్లెర్‌ సమాచారం ప్రకారం రష్యాకు బదులుగా ఇరాక్‌ నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ళు పెరిగాయి. అలాగే, సౌదీ అరేబియా నుంచి కూడా కొనుగోళ్లుపెరిగినట్టు కప్లెర్‌ తెలిపింది. భారత్‌ తనకు అవసరమయ్యే ముడి చమురులో 88 శాతాన్ని విదేశాల నుంచే కొనుగోలు చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -