Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా?

తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా?

- Advertisement -

– సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్న
– కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
– చోద్యం చూస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
– కేంద్ర, ఏపీ ప్రభుత్వాల కుట్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెట్టారా అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నిం చారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంతోపాటు మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రాకు దాసోహమ య్యారని అన్నారు. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు తెలంగాణ పట్ల కుట్ర చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ సమావేశం మినిట్స్‌ వచ్చి నెల దాటినా రేవంత్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపా డాలని డిమాండ్‌ చేశారు. లేఖల డ్రామాలను కట్టిపెట్టాలని సూచించారు. గోదావరి నదిలో బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్‌ శాశ్వతంగా కాపాడారని గుర్తు చేశారు. గోదావరిలో ఉన్న 1,400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి కేటాయించారని చెప్పారు. 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధ ప్రాతి పదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టుల కు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ, ఇప్పుడు గోదావరి జలాలపై పడిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు టీడీపీ ప్రణాళిక వేసిందని అన్నారు. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గమని చెప్పారు. గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకుంటేనే ఢిల్లీ సమావేశానికి వెళ్తామని ముందు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, పోలవరం, నల్లమల్ల సాగర్‌ అంశాలను ఏపీ ప్రభుత్వం ఎజెండాలో పెట్టినా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆ సమావేశం మినిట్స్‌పై గట్టిగా అభ్యంతరం తెలపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కోరారు.

31 వరకు అసెంబ్లీ జరపాలి
అసెంబ్లీ సమావేశాలను ఈనెల 31 వరకు జరపాలని బీఏసీలో కోరామని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. 30 వరకు అసెంబ్లీని నడుపుతామంటూ ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆదివారాలు కూడా సభను నిర్వహిం చాలని తాము కోరామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి చెప్తామన్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంపై ప్రశ్నించా మన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రయివేటు మెంబర్‌ బిల్లుకు అవకాశమవ్వాలని స్పీకర్‌ను కోరా మన్నారు. బీఆర్‌ఎస్‌ తరపున ఇద్దరికి మాట్లాడే అవ కాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. తాము మాట్లాడుతుంటే సీఎం, సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడా లని సూచించామన్నారు. సీఎంపై బీఆర్‌ఎస్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును పట్టించుకోవడం లేదంటూ స్పీకర్‌కు చెప్పామని అన్నారు. 19 అంశా లపై అసెంబ్లీలో చర్చ చేపట్టా లని అడిగామని చెప్పా రు. అసెంబ్లీని ఉదయం తొమ్మిది గంటలకు ప్రారం భించాలని బీఏసీలో డిమాండ్‌ చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -