Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందా.. కూలగొట్టారా?

చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందా.. కూలగొట్టారా?

- Advertisement -

నాసిరకమా?.. కావాలనే కూల్చారా?
పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన  ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని నియోజకవర్గంలో వళ్లెంకుంట-అడవిసోనపల్లి మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్ డ్యాం నిర్మించగా ఈనెల 17న వేకువజామున సుమారు పది మీటర్ల పాడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టు కుపోయిందా.? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్ డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు.

గత నవంబర్ లో పెద్దపల్లి జిల్లాలోని గుంపుల వద్ద చెక్ డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తర హాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్ డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని నియోజకవర్గంలో అడవిసోమన్పల్లి-పివినగర్, చిన్నఓదాల-మల్లారం గోపాల్ పూర్-దబ్బగట్టు ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఉన్నాయి. అడవిసో మన్పల్లి వద్ద నిర్మించిన చెక్ డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

బుంగపడి.. కుంగిపోయిందా..?
కొద్దిరోజుల క్రితం చెక్ డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుoగతోనే కుంగిపోయి కొట్టుకపోయిందని స్థానికులు చెబుతున్నారు.

నాణ్యతపై ఆరోపణలు..
చెక్ డ్యామ్ ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్ డ్యామ్ లపై అధికారుల పర్యవేక్షణ  లేకపోవడంతోనే గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ భారీ వర్షాల సమయంలో కొట్టుకపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల పరిశీలన…స్టేషన్లో పిర్యాదు..
చెక్ డ్యామ్ కొట్టుకపోయిందనే సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈ నిఖిల్ పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకపోయిందా.?..లేక ఎవరైనా కూలగొట్టారా.?..అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అణమానస్పదంగా ఉన్నాయని వరద తాకిడితో కొట్టుకపోయినట్లుగా కనిపించడం లేదని  తెలిపారు. ఘటనపై అధికారులు కొయ్యుర్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చెశారు. ఇరిగేషన్ అధికారుల పిర్యాదు మేరకు కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ లు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.150 మీటర్ల పొడవున చెక్ డ్యామ్ ధ్వంసం అయిందని తెలిపారు.పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -