నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వారు సోమవారం గాజులరామారం పరిధిలోని మహాదేవ్‌పూర్ ప్రాంతంలోని బాలయ్యనగర్‌లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసులు నమోదు చేశామని జిల్లా మద్యనిషేధ మరియు ఎక్సైజ్ అధికారి షేక్ ఫయాజుద్దీన్ తెలిపారు. మొదట అసిముత్తోళ్ల రాజు (20) అనే యువకుడిని తనిఖీ చేయగా అతనివద్ద మత్తును కలిగించే 49 డబ్బాల్లోని హాష్ ఆయిల్ లభ్యమైంది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ డబ్బాలను బాలయ్యనగర్‌కు చెందిన జీ ప్రవీణ్‌కుమార్ (22), జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్‌కు చెందిన పుందుర్తి వీరాచారి (23) ఇచ్చినట్టు గుర్తించారు. వీరిద్దరూ పరారీలో ఉండగా, రాజును అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. అతనివద్ద స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్ విలువ రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాధవయ్య పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఇన్సెపెక్టర్ ఎస్ నర్సిరెడ్డి, ఎస్‌ఐ పీ పవన్‌కుమార్ రెడ్డి, సిబ్బంది సత్తార్, సంజరు, తేజ, చెన్నయ్య, మునాఫ్ పాల్గొన్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
హాష్ ఆయిల్ స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



