Saturday, July 19, 2025
E-PAPER
Homeసినిమాహ్యాట్సాఫ్‌ టు అక్షయ్‌..

హ్యాట్సాఫ్‌ టు అక్షయ్‌..

- Advertisement -

మినీ బాలీవుడ్‌గా పేరొందిన అక్షయ్‌కుమార్‌ మరోమారు తన మంచి మనసుని చాటు కున్నారు. దాదాపు 700 మంది స్టంట్‌మెన్స్‌కి ఇన్సూ రెన్స్‌ చేయించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
హీరో ఆర్య, పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేట్టువం’ సినిమా షూటిం గ్‌లో ప్రమాదవశాత్తూ స్టంట్‌ మ్యాన్‌ రాజు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇండిస్టీలో చర్చనీయాంశంగా మారిన రాజు మరణవార్తను విని అక్షరుకుమార్‌ చలించి పోయారు.
దీంతో 700 మంది బాలీవుడ్‌ స్టంట్‌మ్యాన్స్‌కి ఇన్సూరెన్స్‌ చేయించారు. ఈ ఇన్సూరెన్స్‌ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్‌ మ్యాన్‌ సెట్‌లో లేదా బయట ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు. అక్షరు చేసిన ఈ గొప్ప పనికి సోషల్‌ మీడియా వేదికగా ‘హ్యాట్సాఫ్‌ టు అక్షరు’ అనే ట్యాగ్‌తో ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీనిపై బాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ విక్రమ్‌సింగ్‌ మాట్లాడుతూ, ‘మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో 700 మంది స్టంట్‌మ్యాన్‌లు, యాక్షన్‌ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు’ అని అక్షయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
సంవత్సరానికి కనీసం నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది నటీనటులకు, సాంకేతికనిపుణులతోపాటు సినిమాని నమ్ముకుని పని చేస్తున్న కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న హీరో అక్షయ్‌కుమార్‌. అందుకే ఆయన్ని మినీ బాలీవుడ్‌గా పిలుస్తారు.
రీల్‌ లైఫ్‌లో హీరోగానే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన హీరోనే. ఆయన సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాదు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు, పోలీసు సిబ్బందికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఇప్పటికే ఎన్నోసార్లు భారీ విరాళాలను అందించారు. అవాంఛ నీయ సంఘటనలను దీటుగా ఎదుర్కొనేందుకు మహిళలను చైతన్యవంతం చేస్తూ, వారికి కరాటేలో శిక్షణ ఇప్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -