రూ.3 వేల కోట్ల స్థల విక్రయానికి యత్నం
ప్రభుత్వం వెనక్కి తగ్గాలి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
నవతెలంగాణ- తుర్కయంజాల్
కోహెడ ఫ్రూట్ మార్కెట్‌కు కేటాయించిన సుమారు రూ.3 వేల కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల భూములను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ కోహెడ మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో అంత ర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి రూ.1000 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలవకుండా భూముల విక్రయానికి ప్రయత్నించడం అన్యాయమని అన్నారు.
కొద్దిమంది దళారుల ప్రయోజనాల కోసం లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్ సమీపంలోని విలువైన భూములను విక్రయించి, ఇతర ప్రాంతాలకు మార్కెట్‌ను మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి భూముల వ్యవహారాలపైనే దృష్టి సారించిందని విమర్శించారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోహెడ భూముల విక్రయాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని, మార్కెట్ అభివృద్ధి వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్తు వెంకట రమణారెడ్డి, కందాడ లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, దండెం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోహెడ భూములపై కన్నేశారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



