నవతెలంగాణ-మర్రిగూడ
ప్రమాదవశాత్తు గడ్డి కట్టలు దగ్ధం అయ్యి రూ.50 వేల నష్టం జరిగిన సంఘటన మండలంలోని కొట్టాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కంబాలపల్లి యాదయ్య ఇంటి వద్ద కొంతమంది చిన్న పిల్లలు తెలవక గడ్డి కట్టలకు నిప్పు పెట్టడంతో కంబాలపల్లి యాదయ్య కు చెందిన గడ్డి కట్టలు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.50 వేల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. అటుగా వెళుతున్న కొంతమంది వ్యక్తులు గమనించి మంటలను చల్లార్చి భారీ ప్రమాదాన్ని తగ్గించారని ఆయన పేర్కొన్నారు. బకెట్ల ద్వారా నీళ్లు పోసి మంటలను అదుపులోకి తెచ్చిన గ్రామానికి చెందిన కల్లేట్ల సత్యనారాయణ,కల్లెట్ల యాదయ్య,కొలుగూరి ప్రశాంత్ ను ఆయన అభినందించారు.
కొట్టాలలో గడ్డివాము దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



