Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుHCAను పూర్తిగా ప్రక్షాళన చేయాలి

HCAను పూర్తిగా ప్రక్షాళన చేయాలి

- Advertisement -

అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు , ప్యానెల్ ను బర్తరఫ్ చేయాలి

– HCA అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాద్యులను కఠినంగా శిక్షించాలి

డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి, అక్రమాలకు పాల్పిడిన HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈఓ, సెక్రటరీ, ప్యానెల్ సభ్యులను బర్తరఫ్ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తో పాటు ప్యానల్ సభ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించడం తోపాటు HCA ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు నిలయంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మారిందాన్నారు. ఐపీఎల్ టికెట్ల నుండి స్టేడియంలో జరిగిన అనేక అవినీతి అక్రమాల వరకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రమేయం ఉందన్నారు. నకిలీ పత్రాలను సృష్టించి క్లబ్బులను ఏర్పాటు చేసి అధ్యక్షుడు అయ్యారన్న ఆరోపణలు అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఉన్నాయని తెలిపారు.

ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో అధ్యక్షుడిగా తన ఆధిపత్యాన్ని చెలాయించుకొని టికెట్ల గోల్మాల్ విషయంలోనూ.. అదేవిధంగా స్టేడియంలో జరిగిన పనుల ఏర్పాట్ల విషయంలో అనేక అవినీతి ఆక్రమాలకు పాల్పడ్డారు. మొదటినుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కారణమవుతుందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం HCA కార్యకలాపాలపై పర్యవేక్షణ పెట్టాల్సిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం ప్యానల్ ను బర్తరఫ్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టి భాద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో ప్రమేయం ఉన్నా చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కవిత రాజేంద్ర యాదవ్ లపై కూడా కఠినమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్సీఏను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ధర్నా కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావీద్, రాష్ట్ర నాయకులు ఆర్ఎల్ మూర్తి, కె.విజయ్, రాజు, రవి, నాగరాజు, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -