- Advertisement -
ముంబయి : దిగ్గజ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం (2025-26)లో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 11.5 శాతం పెరుగుదలతో రూ.18,654 నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,736 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.30,650 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ3లో 6.4 శాతం పెరిగి రూ.32,620 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.42 శాతం నుంచి 1.24 శాతానికి దిగివచ్చాయి.
- Advertisement -



