ముంబయి : ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో బీమా సంస్థలలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్ సహాయం తో సామాన్యులకు ఆర్థిక రక్షణ, దీర్ఘకాలిక పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీ అండ్ సీఈఓ విభా పడల్కర్ పేర్కొన్నారు. ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 3,750 పైగా బ్రాంచ్‌లు, వారి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌నకు సంబంధించిన సమగ్ర బీమా పరిష్కారాలు ఇకపై కస్టమర్లకు లభిస్తాయన్నారు. 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యానికి ఈ భాగస్వామ్యం కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. తమ బ్రాంచ్ నెట్‌వర్క్, కస్టమర్లతో ఉన్న బలమైన అనుబంధాన్ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్ నైపుణ్యంతో కలిపి భారతీయ కుటుంబాలకు మెరుగైన రక్షణ కల్పిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ సీఈఓ షాజీ వర్గీస్ పేర్కొన్నారు.



