Wednesday, February 4, 2026
E-PAPER
Homeక్రైమ్లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కి .. డ్రైవర్‌పై కత్తితో దాడి

లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కి .. డ్రైవర్‌పై కత్తితో దాడి

- Advertisement -

– చిట్యాల జాతీయ రహదారిపై ఘటన
– పరారీలో దుండగుడు
నవతెలంగాణ -చిట్యాల

లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కిన దుండగుడు కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్‌పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత మొబైల్‌ ఫోన్‌ను లాక్కునేందుకు యత్నిం చగా డ్రైవర్‌ ప్రతిఘటిం చడంతో పారిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద 65జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఎస్‌ఐ మామిడి రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు డ్రైవర్‌ ఇమ్రాన్‌ కారులో వెళ్తున్నాడు. నార్కెట్‌పల్లి వద్దకు రాగానే ఒక వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు. ఇమ్రాన్‌ అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. చిట్యాల సమీపానికి రాగానే ఆ వ్యక్తి డ్రైవర్‌పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి, మొబైల్‌ ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ ప్రతిఘటనతో దుండగుడు పారిపోయాడు. కత్తి వేట్లతో రక్తస్రావం కావడంతో ఇమ్రాన్‌ పరిస్థితి విషమంగా మారింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. దుండగుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -