విరాట్ కోహ్లి బ్యాటింగ్‌పై సంజయ్ బంగర్
ముంబయి : 2025 ఐపీఎల్ ఫైనల్ తర్వాత తొలిసారి టీ20 మ్యాచ్ బరిలోకి దిగిన విరాట్ కోహ్లి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 38 బంతుల్లోనే అజేయంగా 69 పరుగులు సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అదిరే విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలెట్టిన కోహ్లి 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాతి ఐదు బంతుల్లోనే 19 పరుగులు పిండుకున్నాడు. ‘కోహ్లితో పాటు బ్యాటింగ్ చేసే బ్యాటర్ తన పని చేస్తే… నిజానికి కోహ్లి వేగంగా ఆడాల్సిన పని లేదు.
ఎందుకంటే, కోహ్లి ఎప్పుడైనా తన స్ట్రయిక్‌రేట్‌ను పెంచగలడు. అవసరమైనప్పుడు సిక్స్‌లు, ఫోర్లు కోహ్లి అలవోకగా కొట్టగలడు’ అని సంజయ్ బంగర్ అన్నాడు. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లోనే 61 పరుగుల ఇన్నింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదనను సులభతరం చేయటంతో.. ఆరంభంలో కోహ్లి నెమ్మదిగానే ఆడాడు. ‘కోహ్లి ఇంకా తన జోన్‌లోకి రాలేదు. ఈ సీజన్‌లో కోహ్లి నుంచి ఎంతో చూడబోతున్నామని’ అంబటి రాయుడు అన్నాడు.



