నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : నువ్వే నా సర్వస్వం అంటూ ప్రేమించాడనీ, తన ఇష్టంతో రిజిస్టార్ కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి నాకు వద్దు అంటూ అవమానిస్తున్నడని, యువతి సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యువతి, ఎనమల్ల ఇందిరా ప్రియదర్శిని తాను చదువుకుంటున్న రోజుల నుంచి మిత్రుడు , యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన జీడిమడ్ల మహేందర్ రెడ్డి తామిద్దరం ఇష్టపడి, హైదరాబాద్ ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 14 అక్టోబర్ 2022లో చట్ట ప్రకారం కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపింది. రెండున్నర సంవత్సరాలకు పైగా కలిసి కాపురం చేసినట్లు తెలిపారు. అమ్మాయి ప్రయివేట్ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ, అబ్బాయి వ్యాపారం అంటూ రెండు సంవత్సరాలకు పైబడి సాఫీగా కాపురం చేశారు. ఇంతలో నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానవు నాకు వద్దు అంటూ.. అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో కులాంతర వివాహిత జంట తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, పెద్దల సమక్షంలో రెండు మార్లు పంచాయతీ పెట్టించినా..ఫలితం లేకపోయింది. తక్కువ కులం అనే మాటలో మార్పు రాలేదనీ, నాకు వద్దు మీది ఎస్సీ కులం అంటూ పెద్ద మనుషుల ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. అబ్బాయి ఇంటి ముందు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని అనుకుంటున్న క్రమంలో ఫోన్ చేసి మా ఇంటి ముందుకు వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని ఫిర్యాదులో తెలిపింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తనకు న్యాయం చేయమంటూ సోమవారం కలెక్టర్ ను వేడుకున్నట్లు తెలిపారు.
పెళ్లి తర్వాత కులం పేరుతో అవమానిస్తున్నాడు..
- Advertisement -
- Advertisement -