Sunday, March 8, 2026
E-PAPER
Homeక్రైమ్కన్న కూతుళ్లను కడతేర్చాడు

కన్న కూతుళ్లను కడతేర్చాడు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కన్న తండ్రే కూతుళ్లను చెరువులో పడవేసిన దారుణ ఘటన కామారెడ్డి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన సంఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం, కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్‌, షబీనా దంపతులకు షీపాత్‌ (8), అయత్‌ (7), మరియం (5) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. శనివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో కామారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముగ్గురూ చిన్న పిల్లలు కావడంతో పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేశారు. పిల్లల తండ్రిని వారి పంథాలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. పిల్లలను తానే హత్య చేసి చెరువులో పడవేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ నరహరి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -