నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘సీతా పయనం’. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా..’ అనే సాంగ్ రిలీజ్ చేశారు.
‘ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ కావడమే గాక, అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది అని చిత్రయూనిట్ తెలిపింది. ఈచిత్రానికి స్టోరీ-స్క్రీన్ ప్లే-ప్రొడ్యూసర్, డైరెక్టర్: అర్జున్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, ఎడిటర్: అయూబ్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, జనకృష్ణ, ఫైట్స్: కిక్కాస్ ఖాళీ.
‘ఆహా ఓహో అంటాడు..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



