- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకోజి చేసేది పోలీసు ఉద్యోగమైన తన వంతుగా సమాజానికి సేవలు అందించాలని దృక్పథంతో ఆపదలో ఉన్న నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించి మానవత్వానికి మారుపేరుగా నిలిచారని మండల ప్రజలు అభినందిస్తున్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ దశదినకర్మ లో భాగంగా అందుకు అవసరమైన 50 కేజీల బియ్యం, నూనె, నిత్యవసర సరుకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. గతంలో కూడా ఎంతోమంది నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని పలువురు ప్రశంసించారు.
- Advertisement -