Thursday, January 8, 2026
E-PAPER
Homeఆటలుహెడ్‌, స్మిత్‌ శతకాలు

హెడ్‌, స్మిత్‌ శతకాలు

- Advertisement -

– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 518/7
– యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్టు
సిడ్నీ (ఆస్ట్రేలియా)
: కంగారూ బ్యాటర్లు ట్రావిశ్‌ హెడ్‌ (163, 166 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (129 నాటౌట్‌, 205 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో చెలరేగారు. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. 24 ఫోర్లు, ఓ సిక్సర్‌తో దంచికొట్టాడు. స్టీవ్‌ స్మిత్‌ మిడిల్‌ ఆర్డర్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో కదం తొక్కుతున్నాడు. కీలక భాగస్వామాలు నిర్మించిన ట్రావిశ్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌లు యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్టులో ఆతిథ్య జట్టును ముందంజలో నిలిపారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లలో 7 వికెట్లకు 518 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా ప్రస్తుతం 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. శతక వీరుడు స్టీవ్‌ స్మిత్‌తో పాటు బ్యూ వెబ్‌స్టర్‌ (42 నాటౌట్‌, 58 బంతుల్లో 4 ఫోర్లు) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. ఉస్మాన్‌ ఖవాజా (17), అలెక్స్‌ కేరీ (16), కామెరూన్‌ గ్రీన్‌ (37), మైకల్‌ నెసర్‌ (24), మార్నస్‌ లబుషేన్‌ (48), జేక్‌ వెథర్‌లాండ్‌ (21) ఆసీస్‌ భారీ స్కోరు సాధించటంలో భాగమయ్యారు. రెండో రోజు పిచ్‌ నుంచి పేసర్లకు సహకారం దక్కినా సద్వినియోగం చేసుకోని ఇంగ్లాండ్‌.. మూడో రోజు ఆటలోనూ నిరాశపరిచింది. బ్రైడన్‌ కార్స్‌ (3/108), బెన్‌ స్టోక్స్‌ (2/87), జోశ్‌ టంగ్‌ (1/89), జాకబ్‌ బెతెల్‌ (1/50) వికెట్లు పడగొట్టారు. సిడ్నీ టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఆతిథ్య ఆస్ట్రేలియా నేడు ఉదయం సెషన్లో వేగంగా పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలో పడేసే ప్రయత్నం చేయనుంది. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ను 3-1తో ఇప్పటికే ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -