Wednesday, May 7, 2025
Homeఖమ్మంమునగతో ఆరోగ్యం, ఆర్ధిక సాధికారత..

మునగతో ఆరోగ్యం, ఆర్ధిక సాధికారత..

- Advertisement -

సాగుకు ప్రభుత్వం చేయూత…
వ్యాపారవేత్తలు గా ఎదగాలి…
వ్యవసాయ కళాశాల సందర్శనలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
నవతెలంగాణ – అశ్వారావుపేట
: మునగ సాగుతో ఆర్ధిక సాధికారత సాధించడంతో పాటు,దీనిని కూరల్లో వినియోగించడం ద్వారా పోషకాలు లభించి చక్కని ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆయన మంగళవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ప్రొఫెసర్స్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విద్యార్ధులు సాగు చేస్తున్న ప్రయోగ పంటలను,విద్యాపరంగా నిర్వహించే కార్యకలాపాలను,కళాశాల ప్రాంగణంలో సాగు చేస్తున్న నూతన ఉద్యాన పంటలను,వంగడాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్ధుల అనుభవాలను,బోధనా సిబ్బంది కార్యాచరణను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.కళాశాలలోని ప్రతీ విభాగాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు వ్యవసాయ కళాశాల ఆశయాలు అయిన బోధన – పరిశోధన – విస్తరణ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.చదువు ఉద్యోగానికి మాత్రమే కాకుండా మరో పదిమందికి ఉపాధి కల్పించేలా విద్యార్థులే వ్యాపారులు గా ఎదగాలని ఆకాంక్షించారు. మునగ సాగు కు ఉపాధి హామి ద్వారా ప్రభుత్వం చేయూత ఇస్తుందని తక్కువ విస్తీర్ణం లో అధిక దిగుబడులు వచ్చే విధంగా మునగ చేసుకుని సాదారణ రైతులు అర్ధిక పరిపుష్టి సాధించాలని అన్నారు.పంట సేకరణ,మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం కోసం కార్యాచరణ చేపడతామని అన్నారు. ప్రతీ రైతు తనకు ఉన్న సాగు భూమిలోనే ఫాం పాండ్,ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలం రక్షించుకోవచ్చు అని,నేల వర్షపు నీటికి కోతకు గురి కాకుండా కాపాడుకోవచ్చని అన్నారు. మునగ పంటను భద్రాద్రి జిల్లా నుండే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్,కళాశాల బోధనా సిబ్బంది ప్రొఫెసర్స్ నీలిమ, నాగాంజలి, కే.శిరీష, స్రవంతి, రాంప్రసాద్, శ్రావణ్, క్రిష్ణ తేజ్ లు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్, తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఏవో శివరాం ప్రసాద్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -