Friday, May 2, 2025
Homeఎడిట్ పేజిఆరోగ్య భద్రత-శ్రామికుల హక్కు

ఆరోగ్య భద్రత-శ్రామికుల హక్కు

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణం పొందే కనీస ప్రాథమిక హక్కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయిన ప్పటికీ ఆరోగ్య భద్రత రోజురోజుకూ మృగ్యమవుతోంది. ”ప్రపంచ పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం దినోత్సవం (వరల్డ్‌ డే ఫర్‌ సేఫ్టీ అండ్‌ హమల్త్‌ ఎట్‌ వర్క్‌)” అనబడే ఈ కార్యక్రమాన్ని 2003 నుంచి ఐరాసకు చెందిన ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఏప్రిల్‌ చివరివారంలో దీన్ని నిర్వహిస్తోంది. వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధుల నివారణను ప్రోత్సహించడానికి, పని ప్రదేశాల్లో భద్రతతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని పెంచడానికి అవసరమైన అవగాహనను ఈ వేదిక ద్వారా కల్పిస్తారు. కార్మికులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని పరిస్థితులను కల్పించడం యాజమా న్యాల కనీస బాధ్యత. కానీ ఇది ఎక్కడా నోచుకోవడం లేదు. ఉద్యో గంలో అనుకోని ప్రమాదాలు, వ్యాధులు అనే ప్రధాన సమస్యలతో 2.3 మిలియన్ల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారంటే మాటలు కాదు.
”ప్రపంచ పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్య దినోత్సవం” వేదిక గా ప్రభుత్వాలు, సంస్థలు, ట్రేడ్‌ యూనియన్లు వివిధ అవగాహన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నాయి. 2025 ప్రపంచ పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్య దినోత్సవం ఇతివృత్తంగా ”పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్య విప్ల వం ఏఐ , డిజిటలైజేషన్‌ పాత్ర” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. దాదాపు యాభైశాతం కార్మికులు పని ప్రదే శాల్లో అభద్రత, అనారోగ్యాలను ఎదుర్కొంటు న్నారని తెలుస్తున్నది. ఆసియాలో కార్మికులు అత్యధికంగా వీటి బారినపడి ప్రాణాలు కోల్పో వడం లేదా అనారోగ్యాల కోరల్లో చిక్కడం ఆందోళనను కలిగిస్తున్నది. పని ప్రదేశ అనారోగ్యాల్లో హృద్రోగాలు అధికంగా నమోదు కావడం బాధాకరం. ఐరాస – ఐఎల్‌ఓ వివరణ ప్రకారం పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యకర వాతావరణం పొందడం వారి కనీస హక్కు అని తెలుసుకోవాలి. అన్ని పనుల్లోకెల్ల గనుల్లో పని చేసే కార్మికులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం పొందడానికి నేటి అత్యాధునిక ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రమా దకరమైన పని ప్రదేశాలు, విషపదార్థాల నియంత్రణ, అతి ఉష్ణోగ్రతలు, ప్రమాదకర వాతావరణం లాంటి పరిస్థితుల్లో రోబో టిక్స్‌ వాడడం వల్ల పనులు త్వరగా, సులభంగా పూర్తవుతున్నాయి. రోబోలు, డ్రోన్లు లాంటి సాంకేతిక ఆవిష్కరణలతో ప్రమాదకరమైన పనులను తేలికగా చేయడం, ప్రమాద హెచ్చరికలకు డిజిటల్‌ సెన్సార్లు వాడడం సర్వ సాధారణమయ్యాయి. నేడు రోబోటిక్స్‌, ఏఐ -ఎంఎల్‌, ఎగ్జోస్కెలిటన్స్‌, మానవ రహిత వైమానిక వాహనాలు, ఐఓటి, రిమోట్‌ కంట్రోల్‌ వర్క్‌, వర్చువల్‌ అండ్‌ ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ లాంటి టెక్నాలజీలను ప్రమాదకర పని ప్రదేశాల్లో విని యోగించడం క్రమంగా పెరుగుతోంది.
వృత్తిపరమైన ఆరోగ్యం, సురక్షిత వాతావరణమే ప్రాధాన్యంగా సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ మార్పులను అడ్డుకోవడం వల్ల ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 కూడా సుసాధ్యం అవుతా యని గమనించాలి. పని ప్రదేశాల్లో భద్రత కొరవడినపుడు కార్మి కుల అనారోగ్యాలు పెరిగి వారితో ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతూ, దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడతారని గమనించాలి. ఈ విషయాలన్నీ పని ప్రదేశాల్లో సరైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. అప్పుడే ఉత్పత్తి పెరిగి దేశాభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది. వారు ఆరోగ్యంగా ఉంటేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి.దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– డా:బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
9949700037

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img