హైదరాబాద్‌లో భారీ వర్షం

Rain In Hyderabadనవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్,ఫిలింనగర్‌, ఖైరతాబాద్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ,సోమాజిగూడ, రసూల్‌పుర, అమీర్‌పేటలో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది.

Spread the love