Wednesday, May 20, 2026
E-PAPER
Homeక్రైమ్బైక్‌ను ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి

బైక్‌ను ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి చెందిన వనపర్తి ప్రమోద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -