ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
నవతెలంగాణ – కుభీర్
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషాదకర ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 3,4వ తరగతి చదువుతున్న సోఫియాన్(10), గణేష్(13) సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి సమీపంలో ఉన్న చెరువుకు మరొక స్నేహితునితో కలిసి ఈతకు వెళ్లారు. సోఫియాన్, గణేష్ చెరువులో ఈతకు దిగగా మరో బాలుడు ఒడ్డుపైనే ఉన్నాడు. చెరువులో దిగిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఒడ్డుపై ఉన్న బాలుడు స్థానికులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఏఎస్పీ సాయికిరణ్, భైంసారూరల్ సీఐ ప్రవీణ్, ఎస్సై కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సోఫియాన్ మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న గణేష్ భైంసా ఏరియా అస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వారి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
సెలవుల్లో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



