Tuesday, August 11, 2026
E-PAPER
Homeక్రైమ్కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కి..

కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కి..

- Advertisement -


దమ్మాయిగూడలోని పాఠశాలలో దారుణం
విద్యార్థిపై దాడి చేసి గాయపరిచిన 
తోటి విద్యార్థులు
కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-జవహర్ నగర్

దమ్మాయిగూడలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి స్నేహపురి కాలనీకి చెందిన కిరణ్‌కుమార్‌, శోభ దంపతుల కుమారుడు అభిషేక్‌ రెడ్డి మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని ఓ ప్రపయివేటు స్కూల్‌‌లో పదో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌‌లో ఉంటున్నాడు. ఈ నెల 7న రాత్రి ఎనిమిది మంది విద్యార్థులు తమ కుమారుడిపై దాడి చేసినట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి గాయపరిచారని తెలిపారు. అభిషేక్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ.. పాఠశాల యాజమాన్యం తమకు మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డాడని చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. దమ్మాయిగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం అందడంతో వెంటనే తమ కుమారుడిని కామారెడ్డికి తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో తోటి విద్యార్థులు బాలుడిని గాయపరిచినట్టు తేలిందని ఏసీపీ తెలిపారు. దీంతో 8 మంది విద్యార్థులతో పాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -