ర్యాలీకి హాజరైన వందలాది మంది..
పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
నిందితులను కఠినంగా
శిక్షించి ఉరితీయాలి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/అయిజ
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో డా.ప్రియాంక అంతిమ యాత్ర నిర్వహించారు. వందలాది మంది అంతిమయాత్రలో పాల్గొని ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల, అల్లంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన ఈ సంఘటన అత్యంత దుర్మార్గమైనది. ఇది ఎంతమాత్రం ప్రమాదం (యాక్సిడెంట్) కాదు, 100శాతం ప్రణాళికాబద్ధంగా చేసిన హత్యే. ఈ ఘటనకు కారణమైన నిందితులకు చట్టప్రకారం కఠినమైన ఉరిశిక్ష పడేలా చూస్తాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతా’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఘటన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
డా.ప్రియాంక అంతిమ యాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



