నవతెలంగాణ – సుల్తాన్ బజార్ : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్అండ్ డ్రగ్గిస్ట, తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 20 న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ కు ఇండియన్ మెడికల్ అసోసియే షన్ తెలంగాణ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి కిషన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి అశోక్, ఆర్థిక కార్య దర్శి డాక్టర్ టి దయాల్ సింగ్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య ప్రయోజనాలను కాపాడటంతోపాటు నివారణ ఆరోగ్య సంరక్ష చర్యలను బలోపేతం చేసేందుకు, సమాజానికి అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు అంతరాయం లేకుండా అందేలా చేసేందుకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో మ బుధవారం తలపెట్టిన దేశవ్యా ప్తంగా మెడికల్ షాపుల బంద్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. మెడికల్ షాపుల బందుకు సహకరించాలని కోరుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియే షన్ ను కోరిన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ సహకారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరోగ్య సంర క్షణ వ్యవస్థలో కెమిస్ట్ లు, డ్రగ్గిస్టులకు విడదీయరాని అత్యంత కీలకమైన
భాగం అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ దృఢంగా విశ్వసి స్తుందని, వారి ఆందోళనలు మొత్తం వైద్యలోకపు ఆందోళనలుగా పేర్కొన్నారు. మందులకు, రోగులకు మధ్య ఫార్మాసిస్టులు, డ్రగ్గిస్టులు చివరి వారధిగా పని చేస్తారని, వారి సమస్యలను పరిష్కరించకపోతే అవి నేరుగా ప్రజా రోగ్య ఫలితాలను ప్రభావితం చేస్తాయని, మన దేశ ఆరోగ్య వ్యవస్థను బలో పేతం చేయడానికి మొత్తం ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మధ్య సంఘీభావం చాలా అవసరం అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తక్షణమే వారితో చర్చలు ప్రారంభించా లని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖలన్నీ నైతిక మద్దతు తెలియ జేయాలని పిలుపునిచ్చారు. వారి న్యాయమైన పోరాటంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ భుజం భుజం కలిపి నిలబడుతుందని, ప్రజారోగ్యం రోగుల సంక్షేమం కోసం వైద్యలోకం డాక్టర్లు, కెమిస్టులు అనుబంధ ఆరోగ్య నిపు ణులు ఐక్యంగా వారికి అండగా నిలబడాలని, వారి సమస్యలను సాధ్యమై నంత త్వరగా పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.



