- Advertisement -
గ్రీన్ యాపిల్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులు వీటిని తీసుకోవచ్చు. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ, మలబద్దక సమస్యల్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. వీటిల్లో పోటాషియం మెండుగా ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. గ్రీన్ యాపిల్స్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ ఫ్రూట్స్‌ని తింటే.. తక్కువ కాలంలోనే బరువు తగ్గుతారు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
- Advertisement -