Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నల్లమల అడవి ప్రాంతంలో ఆరోగ్య శిబిరం 

నల్లమల అడవి ప్రాంతంలో ఆరోగ్య శిబిరం 

- Advertisement -

 సీజన్ వ్యాధుల పట్ల  అవగాహన కల్పించిన వైద్యులు.
నవతెలంగాణ – అచ్చంపేట :
నల్లమల అడవి ప్రాంతంలోని  ఫరహాబాద్, మల్లాపూర్ పెంటలలో మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ, ఐటిడిఏ (పీఎం జన్మన్) వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా కలిసి ఫరహాబాద్, మల్లాపూర్ చెంచు పెంటలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 72 మందికి ఆరోగ్య పరీక్షలు జరిపి అవసరమైన చికిత్స అందించారు. 39 మందికి రక్త నమూనాలను సేకరించి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ కు పంపించారు. వర్షాకాలంలో దోమకాటు వ్యాధులైన, మలేరియా డెంగు గురించి అవగాహన కలిగించి దోమలు పుట్టకుండా కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, శుభ్రమైన నీరు, చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కలిగించారు. గర్భవతుల పరీక్షల కొరకు 102 వాహన సేవలు వినియోగించుకోవలసిందిగా తెలియజేశారు. గర్భవతులు ప్రసవ తేది కంటే పది రోజులు ముందుగా అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో చేరాలని గ్రామ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ వైద్యాధికారి కళ్యాణ్ సాగర్, శరత్ , పీఎం జన్మన్ వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి డాక్టర్ మోతిలాల్ నాయక్, అచ్చంపేట ఉప మలేరియా అధికారి బికులాల్, డిపిఎంవో మధుమోహన్, టిపిఎం సేవియా, ల్యాబ్ టెక్నీషియన్ హరిలాల్,హెల్త్ అసిస్టెంట్ రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -