Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ క్యాంపులు

మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ క్యాంపులు

- Advertisement -

మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకూ మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 20,639 హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దేశవ్యాప్తంగా అమలు చేయనున్న స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌ (ధార్‌) నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అమీర్‌పేట్‌ సీహెచ్‌సీ నుంచి మంత్రి దామోదర్‌ రాజనర్సింహతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని చోట్ల స్పెషలిస్ట్‌ డాక్టర్లతో క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలనీ, ప్రతి జిల్లాలో ఒక మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ఆరోగ్యశాఖకు ఆయన అభినందనలు తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య తనిస్తున్నదనీ, ఆరోగ్య మహిళా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ క్లినిక్‌లలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ, అసరమైన వారికి మందులిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్ల ద్వారా మహిళల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ద్వారా వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తున్న ట్టు తెలిపారు. ట్రాన్స్‌ జెండర్లకు మైత్రి క్లినిక్స్‌, ప్రజలకు ఎన్‌సీడీ క్లినిక్స్‌ ద్వారా సేవలందిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -