Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం010 పద్దులో లేని..టీచర్లు, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి

010 పద్దులో లేని..టీచర్లు, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి

- Advertisement -

ఆరోగ్యశాఖ మంత్రికి టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

010 పద్దులో లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ కోరింది. ఈ మేరకు గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదరను కలిసి నూతన ఈహెచ్‌ఎస్‌ అమలు చేయాలని నిర్ణయించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, 010 పద్దులో వేతనాలు పొందని మోడల్‌ స్కూల్స్‌, గురుకులాలు, ఎయిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలు, యూనివర్సిటీలు, కేజీబీవీ, యుఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష, వివిధ పబ్లిక్‌ రంగ సంస్థల్లో పని చేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ నూతన ఈహెచ్‌ఎస్‌ను తొలిదశలోనే వర్తింపజేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ సాధ్యాసాధ్యాలను పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -