Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య భీమా ఒక రక్షణ కవచం లాంటిది

ఆరోగ్య భీమా ఒక రక్షణ కవచం లాంటిది

- Advertisement -

కేర్ ఆరోగ్య బీమా శాఖ ప్రారంభం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఒక రక్షణ కవచం లాంటిదని  నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ రితేష్ చంద్ర అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఆర్య నగర్ లో ఏర్పాటుచేసిన కేర్ ఆరోగ్య భీమా శాఖ ను తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ జోనల్ బిజినెస్ హెడ్ ఉదయ్ శంకర్ ఝా, తెలంగాణ ఈఎంటి, ఆర్బిహెచ్  శేఖర్ వెన్నం ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిజామాబాద్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం చూసి చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా సంవత్సరం పొడవునా ప్రామాణిక వృద్ధితో, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము, నిజామాబాద్‌లో 20 హెచ్పి  తో ప్రారంభించాము.

మార్కెట్ నంబర్ 1 ఉత్పత్తులు, ఉత్తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఉన్నాయి. కుటుంబంగా బలమైన పరిశ్రమ వృద్ధితో 13, అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. తెలంగాణ అంతటా మాకు 17 కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మేము తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో శాఖను విస్తరిస్తున్నాము అని తెలియజేశారు. చరిత్ర చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు ఆరోగ్యం అంటే కరోనా ముందు కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ నేర్పిన పాఠాలతో హెల్త్ ఇన్సురెన్స్ ప్రాముఖ్యత ఆప్షన్ నుండి అవసరం గా మారింది. ఈ క్రమంలో కేర్ హెల్త్ అందిస్తున్న ప్రోత్సహకాలు అవకాశాల గురించి క్లుప్తంగా బ్రాంచ్ మేనేజర్ చంద్ర వివరించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో కేర్ ఆరోగ్య భీమా అందుబాటులోకి వచ్చిందని కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మేనేజర్ బి. నిషాంత్, భరత్, భాను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -