Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యమే మహాభాగ్యం - సరైన ఆహారం వలననే ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం – సరైన ఆహారం వలననే ఆరోగ్యం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ఆరోగ్యమే మహాభాగ్యం – సరైన ఆహారం వలననే ఆరోగ్యం” అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేర వేయడం ఐసిడిఎస్ లక్ష్యం అని అంగన్వాడి సూపర్వైజర్ అంతుల్ అన్నారు. బుధవారం మండలంలోని బండారు పల్లి మెట్టు అంగన్వాడీ కేంద్రంలొ పోషణ్ మాసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కేవలం తల్లుల బాధ్యత మాత్ర మే కాకుం డా తండ్రుల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్య మైందని తెలిపారు. అందుకే, వారు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, పెద్దలకు సరైన ఆహారం, పోషక విలువలతో కూడిన భోజ నాన్ని అందించేలా కృషి చేయాలన్నారు.

రోజువారీ ఆహారంలో కూర గాయలు, పండ్లు, పప్పులు, పాలు, గుడ్లు వంటి పోషకాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యే కంగా పాలు, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వా లని సూచించారు. తాగునీరు పరిశుభ్రంగా ఉండే లా చూడాలన్నారు. జంక్ ఫుడ్, అధిక చక్కెర, ప్యాకెజ్డ్ ఆహారాలను తగ్గించాలని అన్నారు. ఇంటి పెద్దల కోసం తక్కువ నూనె, తక్కువ ఉప్పు, ఎక్కు వ ఫైబర్ ఉండే ఆహా రం తీసుకోవాలని చెప్పారు. తండ్రులు తమ కుటుంబానికి మంచి ఆహారం – ఆరోగ్యకరమైన భవిష్యత్తు అనే సందేశాన్ని చేర వేయాలని హితవు పలికారు. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండ డం అనేది వారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలొ అంగన్వాడీ టీచ ర్లు రాణమ్మ, రేణుక, మరియా రాణి, రజియా, విద్యార్థులు, పిల్లల తల్లితండ్రులు, ఆశా కార్యకర్త పద్మ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -