Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భద్రత 

సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భద్రత 

- Advertisement -

పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట 

సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భద్రత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సోమల గడ్డ రహదారికి ఎదురుగా ఉన్న పీఎస్ఆర్ గార్డెన్ యందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పైడాకుల అశోక్ అందించి ప్రజలతో మాట్లాడారు.  గోవిందరావుపేట మండల చల్వాయి, గోవిందరావుపేట, పసర, మరియు లక్నవరం గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్స తీసుకున్న వారికి మందుల ఖర్చుల నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు రావడం జరిగిందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుల వివరాలు…

1. గంగాడి మంజుల రూ.35,000/- గోవిందరావుపేట గ్రామం
2. బైరపాక తారక్ రూ.15,000/- బాలాజీనగర్ గ్రామం
3. రుద్రారపు రాజ్ కుమార్ రూ.29,500/- చల్వాయి గ్రామం
4. దున్నపోతుల శ్యామల రూ.52,500/- చల్వాయి గ్రామం
5. పైడాకుల లింగయ్య రూ.17,500/- చల్వాయి గ్రామం
6. బద్దం సిద్దమ్మ రూ.25,000/-, 21,500/- దుంపెల్లిగూడెం గ్రామం
7. వల్లాల వెంకటేశ్వర్లు రూ.22,500/- దుంపెల్లిగూడెం గ్రామం
8. రావి సాంబశివరావు రూ.34,000/- గోవిందరావుపేట గ్రామం
9. సొప్పరి రిషిత్, రూ.28,000/- కర్లపల్లి గ్రామం
10. లావుడ్య సురేష్, రూ.35,000/- లక్ష్మీపురం గ్రామం
11. గోపిదాసు రజిని, రూ.24,000/- గోవిందరావుపేట గ్రామం
12. పులుగుజ్జు రజిత, రూ.17,000/-) పసర గ్రామం
13. బొట్లపాటి సౌభాగ్యలక్ష్మి రూ.1,60,000/- పసర గ్రామం
14. చల్ల నర్సమ్మ, రూ.49,000/- పసర గ్రామం
15. ఎండి. చాందిని, రూ.21,000/- పసర గ్రామం
16. పొడమేకల కవిత, రూ.28000/- సోమలగడ్డ గ్రామం గార్లతో పాటుగా మొత్తం పదహారు మంది  లబ్ధిదారులకు రూ.6,14,500/- (ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల) చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -